స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఎట్టకేలకు తన కూతురు ఫేస్ రివీల్ చేసింది. బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టి తన టాలెంట్ తో హాలీవుడ్ వరకు ఎదిగింది. ప్రస్తుతం హాలీవుడ్ లోనే ఉంటూ అక్కడే వరుస సినిమాలు చేస్తుంది. ఇక ప్రొఫెషనల్ కెరీర్ నే కాదు పర్సనల్ కెరీర్ లో కూడా హాలీవుడ్ వ్యక్తినే భాగ్యస్వామిగా చేసుకుంది ప్రియాంక. అమెరికన్ సింగర్ మరియు నటుడు నిక్ జోనస్ ని ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరికి గత ఏడాది జనవరిలో ఒక పాప కూడా పుట్టింది. అయితే ఆ పాప ఫోటోని మాత్రం ప్రియాంక ఇప్పటి వరకు చూపించకుండా వచ్చింది.
సోషల్ మీడియాలో కూతురు మాల్తీ మేరీకి సంబంధించిన ఫోటోలు పెడుతూ వచ్చినా ముఖం కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంది. తాజాగా ఒక హాలీవుడ్ ఈవెంట్ కి హాజరయ్యిన ప్రియాంక.. అక్కడి ఫొటోలతో మాల్తీ ఫేస్ ని రివీల్ చేసింది. జొనాస్ బ్రదర్స్ వాక్ అఫ్ ఫేమ్ ఈవెంట్ లో ప్రియాంక ఒళ్ళో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున మాల్తీ క్యూట్ ఫోటోలు బయటకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన కూతురికి సరోగసీ ద్వారా జన్మనివ్వడానికి ఒప్పుకున్న వ్యక్తి పేరు వచ్చేలా తన కూతురికి పేరు పెట్టినట్లు వెల్లడించింది.