టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కి పెద్ద అభిమాని క్రికెటర్ ఎం.ఎస్.ధోనీ (MS Dhoni), భార్య సాక్షి అన్నారు.హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో సాక్షి ధోనీ (SakshiDhoni), పాల్గొని.. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ధోని ఎంటెర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ ‘మహేంద్ర సింగ్’.. భార్య సాక్షి.. నిర్మిస్తోన్న తమిళ సినిమా ఎల్‌జీఎమ్ (LGM Movie) ఆగస్టు 4వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో కల్యాణ్ హీరోగా, ఇవానా కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ధోని భార్య హైదరాబాద్(Hyderabad)లో మీడియాతో మాట్లాడారు.
‘‘సాధారణంగా ధోని ఎప్పుడూ సర్‌ప్రైజ్‌లిస్తుంటారు. ఆయన్నుంచి వచ్చిన మరో సర్ప్రైజ్ ఇది. క్రికెట్ (Cricket) అంటే అందరూ ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు. కానీ, మా వారికి అది ప్రొఫెషన్. క్రికెట్ ఎలాగో సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ కాబట్టి సినీ పరిశ్రమలోకి వచ్చాం. ఇద్దరం చాలా సినిమాలు చూస్తాం. ముఖ్యంగా తెలుగులో అయితే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) సినిమాలు నేను చూస్తాను. నేను బన్నీకి పెద్ద అభిమానిని. ఆయన నటించిన అన్ని మూవీస్ చూశాను.’’ అంటూ సాక్షి చెప్పుకొచ్చారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సాక్షిపై పాజిటివ్‌గా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.‘ఎల్జీఎం’ మా తొలి అడుగు. ఇదొక తమిళ చిత్రం(Tamil movie). తెలుగు రాష్ట్రాల్లో మహీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని మేము తెలుగులోకి డబ్ చేస్తున్నాం’’