Nazriya Fahadh: షాకింగ్ డెసిషన్ తీసుకున్న హీరోయిన్ నజ్రియా..ఫ్యాన్స్ హర్ట్!
నజ్రియా(Nazriya Fahadh) షాకింగ్ డెసిషన్ తీసుకుంది. తాను కొంతకాలం పాటు సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తానని ప్రకటన చేసింది.
నేచురల్ స్టార్ నాని సినిమా ‘అంటే సుందరానికి'(Ante Sundaraniki Movie) నుంచి తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ బ్యూటీ నజ్రియా ఫహద్(Nazriya Fahadh). మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. తమిళ్లో ‘రాజా రాణి’ అనే సినిమా(Raja Rani Movie)తో క్రేజ్ తెచ్చుకుంది. క్యూట్ లుక్స్, డ్యాన్స్ తో సినీ ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది.
తాజాగా నజ్రియా(Nazriya Fahadh) షాకింగ్ డెసిషన్ తీసుకుంది. తాను కొంతకాలం పాటు సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తానని ప్రకటన చేసింది. ‘సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటున్నాను. కొంత కాలం పాటు మీ ప్రేమకు దూరం కాబోతున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను. ప్రామీస్’ అని ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో నజ్రియా రాసుకొచ్చింది. అయితే తాను బ్రేక్ ఎందుకు ఇస్తున్నట్లో వెల్లడించలేదు.
నజ్రియా ఫహద్(Nazriya Fahadh) ప్రముఖ హీరో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil)ను ప్రేమ వివాహం చేసుకుంది. ఫహద్ పాజిల్ పుష్ప సినిమా(Pushpa Movie)తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఈ దంపతులు ఇద్దరూ కలిసి ట్రాన్స్ అనే సినిమాలో కనిపించారు. బెంగుళూరు డేస్ అనే సినిమాలో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించినప్పుడే ప్రేమలో పడ్డారు. ఆ సినిమాలో వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా సెట్ అయ్యింది. మూవీ ఘన విజయం సాధించింది.