సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో ఈ మధ్య కాలంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సెలబ్రిటీలు(Celebrities), దర్శక, నిర్మాతలే కాకుండా వారి బంధువులు కన్నుమూయడంతో అభిమానులు(Fans) సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు.. తాజాగా తమిళ ఇండస్ట్రీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్(Vanitha Vijaykumar) మాజీ భర్త, విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్(Peter Paul) మరణించారు.
నటి వనితా విజయ్ కుమార్(Vanitha Vijaykumar) తెలుగు చిత్ర పరిశ్రమకు చంద్రలేఖ సినిమాతో పరిచయం అయ్యారు. కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవీ సినిమాలో ఆమె ముఖ్య పాత్ర పోషించారు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ చిన్న చిన్న వేషాలు వేశారు. బిగ్ బాస్ లో కూడా వనితా విజయ్ కుమార్ సందడి చేశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వనితా విజయ్ కుమార్ మాజీ భర్త పీటర్ పాల్ తుది శ్వాస విడిచినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
సినీ ఇండస్ట్రీలో విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా పీటర్ పాల్ పనిచేశారు. 2020లో వనితా విజయ్ కుమార్ ను వివాహం చేసుకున్నారు. అయితే వీరి బంధం ఎక్కువ రోజులు నిలువలేదు. నాలుగు నెలల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అదే ఏడాది అక్టోబర్ లో వనితా విజయ్ కుమార్(Vanitha Vijaykumar) పీటర్ తో విడాకులు తీసుకుంది. మాజీ భర్త మృతి చెందడంతో వనిత తన ఇన్ స్టాలో సుదీర్ఘ పోస్టు చేసింది. చాలా పోరాటం తర్వాత తన మాజీ భర్తకు విముక్తి, శాంతి లభించాయని, ఈ లోకం నుంచి వెళ్లిపోయినందుకు తనకు బాధగా ఉందని, కానీ ఇప్పటికైనా తన మాజీ భర్తకు ప్రశాంతత లభిస్తుందని నోట్ రాసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్(Viral) అవుతోంది.