2002లో తేజ దర్శకత్వంలో వచ్చిన జయం మూవీ(Jayam movie)తో హీరోయిన్గా పరిచయం అయ్యింది అందాల నటి సదా(Actress Sada).తొలి సినిమాతోనే బస్టర్ హిట్ అందుకుంది ఈ చిన్నాది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో ఆమె నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి (C) గురించి హాట్ కామెంట్స్ చేసింది. తనకు పెళ్లి అంటే ఆసక్తి లేదని స్పష్టం చేసింది. వివాహం చేసుకునే వ్యక్తి అర్థం చేసుకునే వాడు కావచ్చు, కాకపోవచ్చు అని తెలిపింది. పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛను కోల్పోతామని చెప్పింది. ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదని, చిన్నచిన్న కారణాలకే భార్యాభర్తలు(husband and wife) విడిపోతున్నారని, అందుకే తనకు వివాహంపై ఆసక్తి లేదని చెప్పింది.
ప్రస్తుతం సదాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. టీవీ రియాల్టీ షో(reality show)లు, డ్యాన్స్ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. మరోవైపు ఆమె వయసు కూడా 39 ఏళ్లకు చేరుకుంది. ఇప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. దీంతో ఎక్కడకు వెళ్లినా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఆమెకు ఎదురవుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ అలాగా అడపాదప మలయాళంలోనూ నటించింది సదా. తమిళ్ లో హీరో విక్రమ్ (Hero Vikram) తో కలిసి నటించిన అపరిచితుడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో సదా పేరు మారుమ్రోగింది. కానీ మెల్లగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఈ అమ్మడు కనుమరుగైపోయింది. ఇక ఇప్పుడు మరోసారి హీరోయిన్ గా సత్తా చాటాలని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. సినిమాలతోనే కాదు పలు టీవీ షోలకు జడ్జ్ గానూ వ్యవహరిస్తోంది.