‘కలర్ ఫోటో’ హీరో సుహాస్ తాజాగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేది థియేటర్లలో విడుదల కానుంది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో టీనా శిల్పరాజ్ కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
రైటర్ పద్మభూషణ్ సినిమా కథ విజయవాడ నేపథ్యంలో సాగుతుంది. ఇదొక మధ్యతరగతి యువకుడి కథగా ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. తన రచనలను ఇష్టపడే అమ్మాయితో రైటర్ లవ్ లో పడతాడు. కామెడీ పంచులతో కథ సాగుతుందని దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తెలిపారు. తన కెరీర్ లో ఇది బెస్ట్ గా నిలుస్తుందని హీరో సుహాస్ తెలిపారు.