»Vishwak Sen In Mass Look Impressive First Look Poster
Viswak Sen: మాస్ లుక్‌లో విశ్వక్ సేన్..ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్
'లెజెండ్ ఆఫ్ లెజెండ్స్'గా పేరుగాంచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు(Nandamuri taraka Ramarao) 100వ జయంతి సందర్భంగా, VS11నుంచి ది రాగ్స్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల(Poster Release) చేసింది.
టాలీవుడ్(Tollywood)లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న వారిలో హీరో విశ్వక్ సేన్(Viswaksen) కూడా ఒకరు. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. VS11 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ(VS 11 Movie) తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్(First Look poster Release) చేశారు.
ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్:
Nothing can stop a man determined to achieve ultimate glory! ✨ #VS11RagsLook🔥🔥
— Sithara Entertainments (@SitharaEnts) May 28, 2023
చీకటితో పాటు క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు నుంచి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ‘తెలుగు వారి ఆత్మగౌరవం’, ‘లెజెండ్ ఆఫ్ లెజెండ్స్’గా పేరుగాంచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు(Nandamuri taraka Ramarao) 100వ జయంతి సందర్భంగా, VS11నుంచి ది రాగ్స్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల(Poster Release) చేసింది.
ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం(Director Krishna chaitanya) వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి గంగానమ్మ జాతర పోస్టర్ రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలను పెంచింది. తాజాగా నేడు నందమూరి తారక రామారావు(Nandamuri taraka Ramarao) శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది.