»Vijayendra Prasad Released The Trailer Of Mattikatha Movie
Matti katha Movie: ‘మట్టికథ’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
తెలుగు సినీచరిత్రలో ఇది రియల్ లైఫ్, రియల్ యాక్టర్ల యుగం. అద్భుతమైన కథలతో, రొటీన్‌కు భిన్నంగా ఆకట్టుకునే కథనంతో మాస్టర్‌పీస్ వంటి చిత్రాలు వస్తున్నాయి. జనం కూడా ఆదర్శిస్తున్నారు. విభిన్న కథాచిత్రాలకు పేరొందిన మైక్ మూవీస్ సంస్థ అలాంటి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది.
మనకందరికీ తెలిసిన, మనం మరచిపోతున్న ‘మట్టికథ’(Matti katha Movie)ను అద్భుత కథాకథనాలతో మైక్ మూవీస్ రూపొందించింది. ఈ చిత్రం ట్రైలర్‌ను, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మట్టికథ టైటిల్ నాకు బాగా నచ్చింది. మనం పుట్టేది, గిట్టేది మట్టిలోనే. తెలంగాణ(Telangana) అంటే నాకు చాలా అభిమానం. ఇక్కడి ప్రజల మనసు స్వచ్ఛమైనది. ఈ చిత్రాన్ని అందరూ తప్పక చూడాలి’ అని అన్నారు.
‘మట్టికథ’ మూవీ ట్రైలర్:
పల్లెటూరి కుర్రాడి తన కలలను నెరవేర్చుకోవడానికి పడిన తిప్పలను, భూమితో అనుబంబంధాన్ని, పల్లె సరదాలు, కష్టాలు, ఆత్మీయతను ఇందులో వాస్తవికంగా, కళాత్మకంగా చూపారు. ‘‘అన్నంపెట్టే పొలాన్ని అమ్ముకుంటే ఎట్టా బిడ్డా?’, ‘అంత పెద్ద రజాకార్ల దాడప్పుడే మేం ఊరు ఇడ్సి పోలేదు, ఇంతు ముత్తెమంత దానికే పరేషానయిత్తువు’ వంటి భావోద్వేగమైన డైలాగులతోపాటు ట్రైలర్(Trailer) సాగింది.
పవన్ కడియాల దర్శకత్వం(Director Pawan Kadiyala) వహించిన ఈ మూవీని అన్నపరెడ్డి అప్పిరెడ్డి రూపొందించారు. సహనిర్మాతగా సతీశ్ మంజీర వ్యవహరించారు. అజయ్ వేద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ జానపద గాయని కనకవ్వ, ‘బలగం’ తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. స్మరణ్ సాయి సంగీతం అందించగా కుంభం ఉదయ్ ఎడిటింగ్ చేశారు. మట్టికథ మూవీ ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు.