Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేరవకొండకు హిట్ పడి చాలా కాలం అవుతోంది. కరెక్ట్‌గా చెప్పాలంటే.. గీతాగొవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు విజయ్. అయితే లైగర్‌తో పాన్ ఇండియాను షేక్ చేయాలనుకున్నాడు.
రౌడీ హీరో విజయ్ దేరవకొండకు హిట్ పడి చాలా కాలం అవుతోంది. కరెక్ట్‌గా చెప్పాలంటే.. గీతాగొవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు విజయ్. అయితే లైగర్‌తో పాన్ ఇండియాను షేక్ చేయాలనుకున్నాడు. అందుకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాదు లైగర్ రిలీజ్ అవకముందే.. జనగణమన కూడా స్టార్ట్ చేసేశారు. కానీ లైగర్ రిలీజ్ అయిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. ఈ సినిమా దెబ్బకు పూరి ఇంకా కోలుకోలేదు. విజయ్ దేవరకొండ మాత్రం ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విజయ్‌కు కీలకంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోను ఖుషితో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కానీ ఈ సినిమా.. సమంత కారణంగా డిలే అవుతునే ఉంది. సమ్మర్లో కూడా రిలీజ్ కష్టమే అంటున్నారు. దీంతో రౌడీ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు అప్సెట్ అవుతునే ఉన్నారు. తమ అభిమాన హీరోకి ఒక్క హిట్ పడాలని సోషల్ మీడియా వేదికగా అడుగుతునే ఉన్నారు. అయితే ఇప్పుడు విజయ్‌నే డైరెక్ట్‌గా.. ఒక్క హిట్ ఇవ్వన్నా.. అంటూ అడిగేశారు. దానికి విజయ్.. ‘హిట్ ఒక్కటే పెండింగ్రా.. అది కొట్టేయాలి.. కొడదాం.. త్వరలో కొట్టేద్దాం’ అని అన్నాడు. ఇదంతా.. సోషల్ మీడియా వేదికగా, రౌడీ తన అభిమానులతో వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయిన సందర్భంలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను విజయ్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ‘ఖుషి’తో మనోడు ఖచ్చితంగా హిట్ కొడతాడని కామెంట్ చేస్తున్నారు. మరి అప్ కమింగ్ ఫిల్మ్స్ అయినా.. రౌడీకి హిట్ ఇస్తాయేమో చూడాలి.