SKLM: మెడికల్ షాపుల్లో నిద్రమాత్రలు, మత్తు కలిగించే మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ను బలోపేతం చేస్తున్నామని, గత నెలలో జిల్లాలో 175 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.