Mahesh Babu : SSMB 28 టైటిల్ పై ట్రోలింగ్.. ఇదేం టైటిల్ మావా!?
Mahesh Babu : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని.. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏదైనా ట్వీట్ పడితే చాలు.. క్షణాల్లో ట్రెండ్ చేసేస్తున్నారు అభిమానులు. మరో వైపు ట్రోల్స్ రాయుళ్లు అలాంటి వాటి కోసమే.. పనిగట్టుకొని మరీ ఎదురు చూస్తుంటారు. ట్రెండింగ్, ట్రోలింగ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో కామన్‌గా మారిపోయింది.
ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని.. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏదైనా ట్వీట్ పడితే చాలు.. క్షణాల్లో ట్రెండ్ చేసేస్తున్నారు అభిమానులు. మరో వైపు ట్రోల్స్ రాయుళ్లు అలాంటి వాటి కోసమే.. పనిగట్టుకొని మరీ ఎదురు చూస్తుంటారు. ట్రెండింగ్, ట్రోలింగ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో కామన్‌గా మారిపోయింది. అయితే ఇంకా ఎస్ఎస్ఎంబీ 28 టైటిల్‌ను అధికారికంగా ప్రకటించలేదు మేకర్స్. కానీ కొన్ని రూమర్స్ ఆధారంగా టైటిల్ ఫిక్స్ చేసుకొని.. కానీ ఇదేం టైటిల్‌రా బాబు అంటూ.. ట్రోలింగ్ కూడా మొదలు పెట్టేశారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు వంటి టైటిల్స్ ముందు నుంచి ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ‘అమ్మకథ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్‌లో భాగంగా.. నిజంగానే ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశారా.. అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఈ సినిమా కథ మొత్తం అమ్మ చుట్టే తిరుగుతుందని, అందుకే అమ్మ కథ అని ఫిక్స్ చేసినట్టుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం.. దీనిపై భారీ ట్రోలింగ్ తప్పదనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటికే అమ్మకథ టైటిల్ పై ట్రోల్స్, మీమ్స్ స్టార్ట్ చేసేశారు. అమ్మ కథనా.. ఇదేం టైటిల్ రా మావా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్‌కు సైతం ఈ టైటిల్ నచ్చలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదంత చూస్తుంటే.. వీళ్లే టైటిల్ పెట్టేసుకొని, ట్రోల్ చేసుకోవడం కాస్త విచిత్రంగానే ఉంది. అసలు త్రివిక్రమ్ మైండ్‌లో ఎలాంటి టైటిల్ ఉందో ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియా టాక్ ప్రకారం.. ఎవరికి తోచినట్టు వారు చెబుతున్నారు. కాబట్టి.. మాటల మాంత్రికుడు చెప్పేవరకు.. ఎస్ఎస్ఎంబీ 28 టైటిల్ పై క్లారిటీ రానట్టే. ఉగాదికి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.