Mahesh’s SSMB 28 టైటిల్ ఆరోజే .. మూడింటిలో ఏది ఫైనల్!?
Mahesh : అతడు, ఖలేజా వంటి చిత్రాల తర్వాత.. దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. అయినా కూడా సినిమా టైటిల్ ప్రకటించకుండా.. 'ఎస్ఎస్ఎంబీ 28' వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలు పెట్టారు.
అతడు, ఖలేజా వంటి చిత్రాల తర్వాత.. దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. అయినా కూడా సినిమా టైటిల్ ప్రకటించకుండా.. ‘ఎస్ఎస్ఎంబీ 28’ వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలు పెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ స్టైల్లోనే ఫ్యామిలీ టచ్ ఇస్తూ.. యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్.. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఆగష్టు 11న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే బిజినెస్ డీల్ భారీగా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22న టైటిల్ రివీల్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబీ 28 టైటిల్ గురించి ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. గతంలో ఈ సినిమాకు త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్‌లో భాగంగా.. అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు.. వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు టాక్ నడిచింది. అలాగే ‘ఆరంభం’ అనే టైటిల్ కూడా వినిపించింది. దాంతో వీటిలో ఏది ఫిక్స్ చేశారనేది సస్పెన్స్‌గా మారింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఆరంభం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా సోషల్ మీడియా టాక్. కొందరు మాత్రం అర్జునుడు అనే అంటున్నారు. మరి మాటల మాంత్రికుడు ఈ టైటిల్స్‌లోనే ఏదైనా ఫిక్స్ చేస్తారా.. లేదంటే మరో కొత్త టైటిల్‌ను లాక్ చేస్తాడా.. అనేది వేచి చూడాలి.