Rajamouli RRRకే ఇలా ఉంటే.. ఇక SSMB 29 పరిస్థితేంటి!?
Rajamouli : బాహుబలితో పాన్ ఇండియా.. ట్రిపుల్ఆర్తో తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు దర్శక ధీరుడు రాజమౌళి. అంతేకాదు ఏకంగా ఆస్కార్ కొట్టేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి పేరు మర్మోగిపోతోంది. స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం.. ఆర్ఆర్ఆర్ మూవీకి ఫిదా అయిపోయారు.
బాహుబలితో పాన్ ఇండియా.. ట్రిపుల్ఆర్తో తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు దర్శక ధీరుడు రాజమౌళి. అంతేకాదు ఏకంగా ఆస్కార్ కొట్టేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి పేరు మర్మోగిపోతోంది. స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం.. ఆర్ఆర్ఆర్ మూవీకి ఫిదా అయిపోయారు. రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. దాంతో రాజమౌళి అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. జస్ట్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. ఇక హాలీవుడ్ టార్గెట్‌గా సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహకందకుండా ఉంది. నెక్స్ట్ మహేష్ బాబు ప్రాజెక్ట్‌తో అదే చేయబోతున్నాడు రాజమౌళి. ఇప్పటికే గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నట్టుగా చెప్పేశాడు జక్కన్న. అలాగే ఫ్రాంచైజ్ ప్లానింగ్‌లో ఉన్నట్టు.. ఇండియానా జోన్స్ రేంజులో ఉంటుందని చెబుతునే ఉన్నారు. పలు అంతర్జాతీయ వేదికలపై SSMB 29కి నెక్స్ట్ లెవల్ ఎలివేషన్స్ ఇస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆస్కార్ కూడా అందుకోవడంతో.. మహేష్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే.. ఇప్పటికే ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్, హాలీవుడ్ యాక్టర్స్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేయబోతున్నాడు. ఏకంగా వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా ఉంటుందనే టాక్ నడుస్తోంది. అంతేకాదు.. ఆస్కార్ ఖర్చుల కోసం ముందే బడ్జెట్ లెక్కలు వేసి.. రంగంలోకి దిగబోతున్నాడు. వీలైనన్ని ఎక్కువ భాషల్లో SSMB 29ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇలా మహేష్ సినిమా కోసం రాజమౌళి లెక్కలు పెరుగుతునే ఉన్నాయి. కాబట్టి.. బాక్సాఫీస్ దగ్గరే కాదు.. ఎస్ఎస్ఎంబీ 28.. పక్కా ఆస్కార్ టార్గెట్‌గానే రాబోతోందని చెప్పొచ్చు.