అల్లు అర్జున్(Allu Arjun), త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. కాగా, ఈ జోడి మరోసారి రిపీట్ అవుతోంది. అది కూడా వీరి కాంబినేషన్ లో సోషియో ఫాంటసీ మూవీతో రానున్నారు అల్లు అర్జున్, త్రివిక్రమ్(Trivikram) గతంలో జులాయి, S/O సత్యమూర్తి, అలా వైకుంఠపురము(Ala vaikuṇṭhapuram)లో వంటి హిట్ చిత్రాలతో వచ్చారు కాబట్టి రాబోయే ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్(Tollywood)లో సోషియో ఫాంటసీలు చాలా అరుదు కాబట్టి ఇది అందరినీ థ్రిల్ చేస్తోంది. కాగా, ఈ మూవీ కోసం త్రివిక్రమ్ చాలా పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
మహాభారతంలో ని ఓ పాత్రను ఇన్సిపిరేషన్ గా తీసుకొని అల్లు అర్జున్ కోసం పాత్రను డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి .ఇప్పుడు ఈ చిత్రం పాన్ ఇండియా ఎంటర్టైనర్గా ఉంటుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ కథ మహాభారతం లోని పర్వాలకు ఆధునిక అనుసరణ గా మారుస్తున్నట్లు తెలుస్తోంది.18 పర్వాలలో ఆది పర్వము, సభా పర్వము, వన పర్వము, విరాట పర్వము(Virata Parvam), ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసన పర్వము, అశ్వమేధిక పర్వము, ఆశ్రమ పర్వము, ఆశ్రమ పర్వము. పర్వ, మహాప్రస్థానిక పర్వ, స్వర్గారోహణ పర్వ హరివంశ పర్వ.