»The Star Actor Is Going To Be The Father Of The Fourth Child At The Age Of 83
Al Pacino: 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్న స్టార్ నటుడు
హాలీవుడ్ నటుడు 83 ఏళ్ల ఆల్ పాసినో తన 29 ఏళ్ల ప్రేయసి నూర్ అల్ఫాల్లాతో డేటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడంతో త్వరలోనే వీరు తల్లిదండ్రులు కానున్నారు.
హాలీవుడ్(Hollywood) సీనియర్ నటుడు 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ది గాడ్ ఫాదర్ (The Godfather )సిరీస్లో నటించిన ఆల్ పాసినో(Al Pacino) 29 ఏళ్ల నూర్ అల్ఫాల్లాతో డేటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్. నూర్ అల్ఫాల్లా(Noor Alfallah) చిత్ర నిర్మాతగా పలు సినిమాలు నిర్మిస్తోంది. నెల రోజుల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఆల్ పాసినో, నూర్ మధ్య కరోనా టైంలో స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది.
2022 ఏప్రిల్ నుంచి ఆల్ పాసినో(Al Pacino), నూర్(Noor Alfallah) డేటింగ్ చేస్తున్నారు. కాగా ఆల్ పాసినోకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉండటం విశేషం. ఆయన తన మాజీ ప్రియురాలు, యాక్టింగ్ కోచ్ అయిన్ జాన్ టారెంట్ తో ఓ కుమార్తెకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తన కుమార్తె వయసు 33 ఏళ్లు కాగా 1997 నుంచి 2003 వరకూ మరో యువతి బెవర్లీ డి ఏంజెలో తో కలిసి ఉన్నాడు.
వీరికి కూడా కవల పిల్లలు ఉన్నారు. ఆంటోన్, ఒలివియో అనే కవలలు ఉన్నారు. ప్రస్తుతం వారి వయసు 22 ఏళ్లు. ప్రస్తుతం ఆల్ పాసినో(Al Pacino) తన మూడో ప్రేయసి అయిన నూర్ అల్పాల్లా(Noor Alfallah)తో డేటింగ్ చేస్తున్నారు. నూర్ అల్ఫాల్లా కూడా గతంలో ప్రముఖ గాయకుడు మిక్ జాగర్, బిలియనీర్ నికోలస్ బెర్గూన్తో కొంతకాలం పాటు డేటింగ్ చేసి వార్తల్లో నిలిచింది.