Sudheer Babu అసలు రూపం బయటికొచ్చింది! (‘మామా మశ్చీంద్ర’ డీజె లుక్ రిలీజ్)
Sudheer Babu : హీరోగా టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. అంతేకాదు తనకు తానే నైట్రో స్టార్ అనే డిఫరెంట్ బిరుదు ఇచ్చుకొని.. క్రేజీ అనిపించుకున్నాడు. అందుకే ఇప్పుడు నైట్రో స్టార్ బ్రాండ్ వాల్యూని పెంచాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ట్రిపుల్ రోల్ ట్రై చేస్తున్నాడు.
హీరోగా టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. అంతేకాదు తనకు తానే నైట్రో స్టార్ అనే డిఫరెంట్ బిరుదు ఇచ్చుకొని.. క్రేజీ అనిపించుకున్నాడు. అందుకే ఇప్పుడు నైట్రో స్టార్ బ్రాండ్ వాల్యూని పెంచాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ట్రిపుల్ రోల్ ట్రై చేస్తున్నాడు. అది కూడా ఒక్కో పాత్రకు సంబంధం లేకుండా మేకోవర్ అవుతున్నాడు. కమెడియన్, రైటర్, డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో ‘మామ మశ్చీంద్ర’ అనే డిఫరెంట్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు సుధీర్ బాబు. ఈ సినిమాలోనే సుధీర్ బాబు మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ‘మామ మశ్చీంద్ర’ సినిమా నుంచి రెండు పాత్రలకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఓ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ని షాక్ ఇచ్చేశాడు. అదే ‘దుర్గ’ క్యారెక్టర్.. ఈ పాత్రలో సుధీర్ బాబు చాలా లావుగా.. లడ్డు బాబు సినిమాలో అల్లరి నరేష్‌లా కనిపించి నిజంగానే షాక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత రిలీజ్ చేసిన పరశురామ్ లుక్‌లో స్టైలిష్‌గా మేకోవర్ అయ్యాడు. సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్లో గ్యాంగ్ స్టర్‌గా కనిపించాడు సుధీర్ బాబు. ఈ రెండు పోస్టర్స్‌లో కంప్లీట్ కొత్త మేకోవర్‌లో కనిపించిన సుధీర్ బాబు.. ఇప్పుడు రియల్ లుక్‌లోకి వచ్చేశాడు. తాజాగా మామ మశ్చీంద్ర సినిమా నుంచి మూడో పాత్ర ‘డీజే’ లుక్‌ని రివీల్ చేశారు. ఇందులో సుధీర్ బాబు ఒరిజిలన్ లుక్‌లో చాలా ట్రెండీగా కనిపిస్తున్నాడు. మరి ఫైనల్‌గా అసలు రూపంలోకి వచ్చేసిన సుధీర్ బాబు.. మామ మశ్చీంద్రతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.