ప్రస్తుతం టాలీవుడ్లో బ్యాచ్‌లర్ హీరోల లిస్ట్ కాస్త పెద్దదే. అయితే వాళ్లంతా కూడా ప్రభాస్ పెళ్లి తర్వాతే పెళ్లి చేసుకుంటామని అంటున్నారు. వారిలో యంగ్ హీరో శర్వానంద్ కూడా ఉన్నాడు. బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోలో ప్రభాస్ తర్వాతే నా పెళ్లి అంటూ చెప్పుకొచ్చాడు శర్వానంద్. ఇదే విషయాన్ని ప్రభాస్ దగ్గర ప్రస్థావిస్తే.. నేను సల్మాన్ ఖాన్ పెళ్లి తర్వాత అనగలనేమో.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా టాలీవుడ్లో ప్రభాస్, బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నారు. అయితే ప్రభాస్ పెళ్లి గురించి ఇంకా క్లారిటీ లేదు. కానీ రామ్ చరణ్ మాత్రం మరో రెండు నెలల్లో గుడ్ న్యూస్ రాబోతోందని చెప్పాడు. అయితే ప్రభాస్ పెళ్లికి ముందే పెళ్లి పీఠలెక్కబోతున్నాడు శర్వానంద్.
త్వరలోనే శర్వా అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. హైకోర్టు లాయర్ మధుసూధన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని పెళ్లాడనున్నట్టు సమాచారం. ఆమె రాజకీయ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అల్లుడు గంగారెడ్డికి మేనకోడలని తెలుస్తోంది. అతి త్వరలోనే శర్వానంద్ వెడ్డింగ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అంతేకాదు జనవరి 26న, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హోటల్లో ఘనంగా ఎంగేజ్మెంట్ జరగనుందని టాక్. మొత్తంగా శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇక శర్వా సినిమాల విషయానికి వస్తే.. హిట్, ఫట్లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం అనే సినిమాలతో అలరించాడు. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాబోతోంది.