సమంత గురించి ఎలాంటి న్యూస్ బయటికి వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. సామ్ అంటేనే సోషల్ మీడియాలో సెన్సేషన్. అలాంటి సమంత ఇప్పుడు సినిమాలకు దూరమవుతోందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ క్రమంలోనే తాజాగా సమంత లేటెస్ట్ సినిమాలు పనైపోయినట్టు తెలుస్తోంది.
ఆ మధ్య మయో సైటిస్ కారణంగా సినిమాలకు దూరమైన సమంత.. ఇప్పుడు మరోసారి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టు.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న సినిమాల షూటింగ్ అయిపోగానే.. ఇండస్ట్రీకి దూరం అవుతుందని అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో నటిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోయిందట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైనట్టు తెలుస్తోంది. అలాగే తెలుగులో సామ్ చేస్తున్న ఏకైక ప్రాజెక్ట్ ‘ఖుషి’ సినిమా కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.
వాస్తవానికైతే.. ఖుషి సినిమా షూటింగ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సమంత మయోసైటిస్ బారిన పడడంతో.. డిలే అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు.. ‘ఖుషి’ సినిమా షూటింగ్‌ను సమంత పూర్తి చేసిందని సమాచారం. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 1న ఖుషి రిలీజ్ కానుంది. ఇక సమంత ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయడంతో.. సినిమాలకు బ్రేక్ టైం వచ్చేసిందని అంటున్నారు.
కానీ ఖుషి, సిటాడెల్ ప్రమోషన్లకు సమంత వస్తుందా? లేదంటే వాటికి కూడా దూరంగా వుంటుందా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ సమంత నిజంగానే బ్రేక్ తీసుకుంటే.. ప్రమోషన్స్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ యశోద సినిమా రిలీజ్ సమయంలో కష్టంగా ఉన్నా కూడా.. ప్రమోట్ చేసింది సామ్. కాబట్టి.. ఖుషితో పాటు సిటాడెల్ ప్రమోషన్స్‌లో భాగంగా.. సమంత తన అభిమానులను కలిసే ఛాన్స్ ఉందంటున్నారు.