టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో సుధీర్ బాబు(Sudhir Babu) వైవిధ్యభరితమైన మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సినిమాల్లో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సినిమాల్లో కొన్ని విజయం సాధించలేదు. అయినా కూడా మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మామా మశ్చీంద్ర (Maama Mascheendra) అనే టైటిల్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యాడు.
‘మామా మశ్చీంద్ర’ నుంచి లిరికల్ సాంగ్ :
తాజాగా మామా మశ్చీంద్ర సినిమా(Maama Mascheendra) నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది. ”గాలుల్లోన కలలే వాలే..కనురెప్పలు దాటే కొత్తగా సరికొత్తగా నీలా మారే” అంటూ సాగుతోన్న ఆ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. గాయకులు కపిల్ కపిలన్, నూతన మోహన్ ఈ పాటను పాడారు.
మామా మశ్చీంద్ర సినిమా(Maama Mascheendra)లో హీరో సుధీర్ బాబు(Sudhir Babu) మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. డాన్‌గా, డీజేగా, భారీకాయుడిగా ప్రేక్షకులను నవ్వించనున్నాడు. సుధీర్ బాబుకు జోడీగా ఈ మూవీలో ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు.