»Kriti Sanon And Her Sister Start A Production House
Kriti Sanon: చెల్లితో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్న కృతి సనన్..!
కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మహేష్ నేనొక్కడినే సినిమాతో ఇక్కడి వారికి పరిచయం అయ్యింది. ఆ మూవీ క్లిక్ కాకపోవడంతో, ఆమె తెలుగు తెరకు దూరయమ్యారు. చాలా కాలం తర్వాత ఇటీవల ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీపై విమర్శలు వచ్చినా, కృతి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సీతగా కృతి నటనకు అందరూ మంత్రముగ్ధులైపోయారు. కాగా, ఇప్పుడు ఈ బ్యూటీ తన చెల్లిలితో కలిసి బిజినెస్ మొదలుపెట్టింది.
కృతి సనన్ తన సోదరి నూపూర్ సనన్‌తో కలిసి తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది. ప్రొడక్షన్ హౌస్‌కి బ్లూ బటర్‌ఫ్లై హౌస్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమె స్వయంగా వెల్లడించారు. దానికి క్యాప్షన్ గా , “గేర్ మార్చడానికి సమయం వచ్చింది!” అని పెట్టడం విశేషం. ఇక కృతి సనన్ తన ప్రొడక్షన్ హౌస్ బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ లోగోను ఆవిష్కరించడానికి ఓ చిన్ని వీడియోని కూడా విడుదల చేశారు.
‘నేను 9 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో నా కలలను గడుపుతున్నాను. నేను ఇక్కడ నడక మొదలుపెట్టాను. నేర్చుకున్నాను, పరిణితి చెందాను, ఈ రోజు నటిగా ఎదిగాను! నేను చిత్ర నిర్మాణంలోని ప్రతి బిట్, అంశాన్ని ఖచ్చితంగా ఇష్టపడుతున్నాను. ఇప్పుడు, ఇది మరింత చేయడానికి, మరింతగా ఉండటానికి, మరింత తెలుసుకోవడానికి, నా హృదయాన్ని హత్తుకునే మరిన్ని కథలను చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాను’ అంటూ ఆమె పేర్కొన్నారు. కృతి ఇప్పటికే తన సత్తా చాటింది. తాజాగా, ఆమె సోదరి నుపూర్ సైతం టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రవితేజతో రొమాన్స్ చేస్తూ నూపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది.