Vidya Balan: గ్లామర్ రోల్స్ పై విద్యా బాలన్ షాకింగ్ కామెంట్స్
విద్యాబాలన్ తన ఇంటెన్స్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్కి పేరుగాంచింది. ది డర్టీ పిక్చర్, కహానీ , తుమ్హారీ సులు వంటి చిత్రాలలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె కొన్ని సినిమాల్లో గ్లామర్‌తో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే.
గ్లామర్ రోల్స్ చేయడంపై విద్యాబాలన్(Vidya Balan) తాజాగా స్పందించారు. తాను కూడా గ్లామర్ రోల్స్ లో నటించానని చెప్పారు. అయితే, ఆ సినిమా హిట్ అయినా కూడా తనకు తృప్తి కలగలేదని అన్నారు. ఇలాంటి గ్లామరస్ పాత్రల్లో నటించడానికి చాలా మంది ఉన్నారని ఆమె అన్నారు. కేవలం నాలుగు పాటు, మూడు సన్నివేశాల్లో నటించే పాత్రలతోకిక్ వచ్చేది కాదన్నారు. అలాంటి రోల్స్ చేసేటప్పుడు నిద్రలో నడుస్తున్నట్లుగా ఉండేదని ఆమె అన్నారు.కానీ ఇష్కియా సినిమాతో ఆ పరిస్థితి మారిందని ఆమె అన్నారు. విద్యా(Vidya Balan) తన రాబోయే చిత్రం నీయత్లో కనిపించనుంది. అను మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె డిటెక్టివ్ పాత్రను పోషిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే ఆమె ఈ షాకింగ్ కామెంట్స్ చేయడం విశేషం.