K Vishwanath Wife Jayalkshmi Died: కళాతపస్వి కె.విశ్వనాథ్ సతీమణి కన్నుమూత
సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో మరో విషాదం నెలకొంది. కళాతపస్వి కే విశ్వనాథ్(K Vishwanath) ఇటీవలె కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ వార్త మరువకముందే ఆయన సతీమణి కాశీనాధుని జయలక్ష్మి(Jayalakshmi) కన్నుమూశారు. ఆదివారం ఆమె హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో మరో విషాదం నెలకొంది. కళాతపస్వి కే విశ్వనాథ్(K Vishwanath) ఇటీవలె కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ వార్త మరువకముందే ఆయన సతీమణి కాశీనాధుని జయలక్ష్మి(Jayalakshmi) కన్నుమూశారు. ఆదివారం ఆమె హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కె విశ్వనాథ్(K Viswanath) మరణించినప్పటి నుంచే ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. గత కొద్ది రోజులుగా జయలక్ష్మి(Jayalakshmi) అపోలో ఆస్పత్రిలో ఎమెర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
ఆదివారం ఆమె అనారోగ్య పరిస్థితులు విషమించడంతో సాయంత్రం 6.15 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబీకులు ప్రకటనలో తెలిపారు. తమ తండ్రి కె విశ్వనాథ్(K Viswanath) కన్నుమూసిన వార్డులోనే తమ తల్లి జయలక్ష్మి(Jayalakshmi) కూడా కన్నుమూయడం దురదృష్టకరమని కుటుంబీకులు తెలిపారు.
జయలక్ష్మీ(Jayalakshmi) పార్థీవ దేహాన్ని ఫిలింనగర్(Film Nagar)లోని నివాసానికి తరలించారు. సోమవారం పంజాగుట్టలోని శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. కాశీనాధుని జయలక్ష్మీ(Jayalakshmi) వయసు 88 ఏళ్లు. ఆమెకు 15వ ఏట కే విశ్వనాథ్(K Viswanath)తో పెళ్లి జరిగింది.