కళా తపస్వి, సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి లోనయింది. సినీ ప్రముఖులంతా విశ్వనాథ్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందుగా ఫిలిం చాంబర్లో కె.విశ్వనాథ్ పార్థీవదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి కె.విశ్వనాథ్‌కు నివాళులు అర్పించారు. అభిమానులు భారీగా తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొని కళాతపస్వికి తుది వీడ్కోలు పలికారు. ఈనేపథ్యంలో ఒకసారి కళాతపస్విని తలుచుకుంటూ ఆయన బయోగ్రఫీని ఒకసారి చూద్దాం రండి.