జాన్వీ కపూర్(Janhvi Kapoor) తన తల్లి శ్రీదేవిని తలచుకుని భావోద్వేగానికి గురైంది. తన తల్లిని తలచుకుని సోషల్ మీడియా వేదికగా తన మనసులోని మాటను చెప్పుకుంది. ప్రస్తుతం ఆమె పోస్టు వైరల్ అవుతోంది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అలనాటి హీరోయిన్ శ్రీదేవి(Heroine Sridevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ రోజుల్లో శ్రీదేవి తన అందచందాలు, అభినయంతో టాలీవుడ్(Tollywood)లోనే కాకుండా బాలీవుడ్(Bollywood)లోనూ మకుటంలేని మహారాణిలా ఏలింది. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి వరకూ శ్రీదేవి(Sridevi) నటించి మెప్పించింది. అయితే ఆమె దుబాయ్ లోని ఓ హోటల్ లో మరణించింది.
శ్రీదేవికి జాన్వీ కపూర్(Janhvi Kapoor), ఖుషీ కపూర్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తల్లి తర్వాత సినిమా రంగంలోకి జాన్వీ అడుగుపెట్టింది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) తన తల్లి శ్రీదేవిని తలచుకుని భావోద్వేగానికి గురైంది. తన తల్లిని తలచుకుని సోషల్ మీడియా వేదికగా తన మనసులోని మాటను చెప్పుకుంది.
“అమ్మా..నీ కోసం ప్రతి చోటా వెతుకుతూనే ఉంటాను. నేనేం చేసినా అది నువ్వు గర్వించేలా ఉండాలని కోరుకుంటాను. నేను ఎక్కడికెళ్లినా , ఏం చేసినా అది నీతోనే మొదలవుతుంది. నీతోనే ముగస్తుంది” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో జాన్వీ కపూర్(Janhvi Kapoor) నోట్ ను షేర్ చేసింది. అంతేకాకుండా తన తల్లితో కలిసున్న ఫొటోను కూడా జత చేసి షేర్ చేసింది. ప్రస్తుతం జాన్వీ(Janhvi Kapoor) షేర్ చేసిన ఆ పోస్టు వైరల్ అవుతోంది.
చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా పేరుతెచ్చుకున్న శ్రీదేవి 2018లో దుబాయ్ లోని ఓ హోటల్ లో మరణించింది. అప్పుడప్పుడే జాన్వీ(Janhvi Kapoor) సినీ కెరీర్ మొదలవుతోంది. శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ కపూర్(Janhvi Kapoor), ఖుషీ కపూర్ లను తన తండ్రి బోనీ కపూర్ అన్నీ తానై చూసుకుంటున్నాడు. బోనీ కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ కూడా తమ చెల్లెళ్ల పట్ల ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్(Janhvi Kapoor) తెలుగు తెరపై కనిపించేందుకు పలు సినిమా కథలను వింటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈమె గ్రాండ్ గా టాలీవుడ్(Tollywood)లోకి ఎంట్రీ ఇవ్వనుంది.