సింగర్ మంగ్లీ(Singer Mangli) మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవలె మహాశివరాత్రి(Maha Shiva Ratri) సందర్భంగా ఆమె ఓ పాటను రిలీజ్(Song Release) చేసింది. ప్రస్తుతం ఆ పాటే వివాదానికి దారి తీసింది.
సింగర్ మంగ్లీ(Singer Mangli) మరో వివాదంలో చిక్కుకుంది. తెలంగాణ గాయని(Telangana Singer) అయిన మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఈమె జానపద గీతాలను పాడుతూ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు సినిమా పాటలతో పాటు భక్తిరస గీతాల(Devotional Songs)ను పాడుతోంది. జానపదం అయినా, భక్తి గీతం అయినా, ఐటం సాంగ్ అయినా మంగ్లీ పాడితే కచ్చితంగా ఫేమస్ అవుతుంది. అయితే మంగ్లీ పాడే పాటలు కొన్ని వివాదాలకు దారి తీస్తుంటాయి. గతంలో ఆమె పాడిన ఓ భక్తి పాట వివాదాస్పదమైంది. ఆ వివాదంలో మంగ్లీ(Mangli) కూడా సున్నితంగానే క్లారిటీ ఇచ్చింది. తాజాగా మరోసారి మంగ్లీ(Mangli) వివాదంలో చిక్కుకుంది.
మంగ్లీ పాడిన శివరాత్రి సాంగ్:
ఇటీవలె మహాశివరాత్రి(Maha Shiva Ratri) సందర్భంగా ఆమె ఓ పాటను రిలీజ్(Song Release) చేసింది. ఆ పాటను శ్రీకాళహస్తి(Srikalahasti)లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పాటే వివాదానికి దారి తీసింది. మహాశివరాత్రి సందర్భంగా మంగ్లీ శివునిపై ఓ పాట్ ను పాడుతూ రిలీజ్ చేసింది. ఈ పాట షూటింగ్ శ్రీకాళహస్తి(Maha Shiva Ratri)లోని కాలభైరవ స్వామి ఆలయంలో జరిగింది. మంగ్లీ పాడిన ఆ పాటను ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ రచించగా ఆ పాట ఎంతో పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆ పాట ట్రెండింగ్ లో నిలిచింది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి(Srikalahasti)లోని కాలభైరవస్వామి ఆలయంలో ఆ పాట షూటింగ్ కు అనుమతి లేకున్న ఎలా షూట్ చేశారనే విషయంపై వివాదం నెలకొంది. స్వామివారి ఆలయంలో పాటను ఎలా షూట్ చేస్తారని, అనుమతి లేకున్నా మంగ్లీ షూట్ ఎలా చేసిందంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయానికి(Srikalahasti) దక్షిణ కైలాసంగా పేరున్న సంగతి తెలిసిందే. ఆ ఆలయంలో రెండు దశాబ్దాల నుంచి వీడియో చిత్రీకరణకు అనుమతి లేదు. అయితే శివరాత్రి(Maha Shiva Ratri) రోజు సందర్భంగా ఆ ఆలయంలో మంగ్లీ(Mangli) శివుడి పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. షూటింగ్ కు అనుమతి లేని ఆలయంలో మంగ్లీ ఆ పాటను ఎలా షూట్ చేసిందని, మంగ్లీ ఆలయంలో నృత్యం చేసిన విజువల్స్ కూడా పాటలో కనిపిస్తున్నాయని భక్తులు ఫైర్ అవుతున్నారు. శ్రీకాళహస్తి(Srikalahasti) ఆలయంలోని రాయల మండపం, రాహు కేతు మండపం, ఊంజల్ సేవ మండపాలలో మంగ్లీ పాట పాడుతూ నృత్యం చేస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ముక్కంటి ఆలయంలో మంగ్లీ(Mangli) ఇలా వీడియో షూట్ చేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా ఈ వివాదంపై పెదవి విరస్తున్నారు. ప్రస్తుతం మంగ్లీ షూట్ చేసిన శివరాత్రి(Maha Shiva Ratri) పాట యూట్యూబ్ లో ట్రెండింగ్(Trending)లో ఉండగా దీనిపై భక్తులు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.