Pushpa 2: ‘పుష్ప 2’ ఆడియోపై ఫేక్ హైప్.. ఏది నిజం!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. మన లెక్కల మాస్టారు సుకుమార్ ఈ సినిమాను.. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 350 కోట్లతో నిర్మిస్తోంది. అందుకే ఈ సినిమా పై మొదటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కానీ ఇప్పుడో విషయంలో మాత్రం కావాలనే.. ఫేక్ నెంబర్స్ చూపించి హైప్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇంతకీ పుష్ప2 ఆడియో రైట్స్ ఎంతకు అమ్ముడిపోయాయి?
తెలుగులో కంటే బాలీవుడ్లో దుమ్ముదులిపేసింది పుష్ప మూవీ. అది కూడా కోవిడ్ సమయంలో 50% థియేటర్ ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు భారీ వసూళ్లను రాబట్టింది. హిందీ బెల్ట్ దగ్గర పుష్పరాజ్ వసూళ్ల వర్షం కురిపించాడు. అందుకే ఇక్కడ కంటే.. హిందీ జనాలే సెకండ్ పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్‌కు అక్కడ భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇప్పటికే భారీ ఆఫర్లు పుష్పరాజ్ తలుపు తడుతున్నట్టు టాక్ నడుస్తోంది.
ఈక్రమంలోనే కొన్ని వారాల క్రితం, పుష్ప 2 మేకర్స్ ఆడియో హక్కుల కోసం 65 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్నారని వార్తలొచ్చాయి. టీ సిరీస్ సంస్థ ఇంత మొత్తం చెల్లించిందని టాక్. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పుష్ప సినిమా ఆడియోకి అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసింది. అందుకే ఇంత భారీ డీల్ జరిగిందని అన్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, అదంతా ఫేక్ అని తెలుస్తోంది. కేవలం మేకర్స్ ఫేక్ హైప్ క్రియేట్ చేయడానికే.. ఇలాంటి నంబర్స్‌ను ప్రచారం చేస్తున్నారనే టాక్ ఊపందుకుంది. వాస్తవానికైతే.. పుష్ప2 అన్ని భాషల ఆడియో హక్కులు 20 కోట్లకు పైగా అమ్ముడయ్యాయట. 65 కోట్ల లెక్క ప్రకారం చూస్తే ఇది 69% తక్కువగా ఉంది. అయితే ఈ మూవీ పై వచ్చే లెక్కల పై ఎప్పుడు చర్చ జరుగుతునే ఉంది. గతంలో ఏకంగా 1000 కోట్ల డీల్‌ను పొందినట్లు కొన్ని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత వచ్చిన రిపోర్టులన్నీ ఫేక్ అని తేల్చేసింది. మరి పుష్ప2 ఆడియో రైట్స్‌లో ఎంత వరకు నిజముందో చూడాలి.