పోయిన సంక్రాంతికి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌తో 'వారిసు' సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు నిర్మాత దిల్ రాజు. ఇదే జోష్‌లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. బాలీవుడ్లో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్‌తో డ్యూయెల్ రోల్ చేయించబోతున్నాడు.
ప్రస్తుతం బాలీవుడ్(Bollywood) హీరోలు తెలుగు మేకర్స్‌తో సినిమాలు చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ సంస్థ బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తోంది. దిల్ రాజు(Dil Raju) కూడా బాలీవుడ్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో గేమ్ ఛేంజర్ సినిమా(Game changer Movie)ను నిర్మిస్తున్నారు. మరో వైపు మీడియం రేంజ్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్(hero shahid kapoor)తో ఓ సినిమా చేస్తున్నాడు. జెర్సీ, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలను హిందీలో రీమేక్ చేసి మంచి విజయాలను అందుకున్నాడు షాహిద్.
జెర్సీ రీమేక్‌లో దిల్ రాజు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అయితే జెర్సీ సినిమా పెద్దగా అలరించలేకపోయంది. దాంతో ఈసారి షాహిద్‌తో కలిసి స్ట్రెయిట్ ఫిల్మ్ చేస్తున్నాడు. అది కూడా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. అనీస్ భాజ్మీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, ఏక్తాకపూర్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఆగస్ట్ 1న ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో షాహిద్‌కపూర్ డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడట. షాహిద్‌కపూర్ కెరీర్లో ఈ సినిమా స్పెషల్‌గా నిలిచిపోతుందని అంటున్నారు. ఇప్పటికే షాహిద్ మూడు నెలల డేట్స్ ఇచ్చాడు. మరి దిల్ రాజు ఈ సినిమాతో బాలీవుడ్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.