ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie) తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్(Game changer). ఈ మూవీని దర్శకుడు శంకర్(Director Shankar) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు(Buchibabu)తో సినిమా తీస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అయ్యాయి. ఆ విషయంలో రామ్ చరణ్ కూడా క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని చెప్పారు. అయితే ఈ సినిమాపై మరో రూమర్ వైరల్(Rumour Viral) అవుతోంది.
ప్రస్తుతం చరణ్(Ramcharan) తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar)తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ధి సినిమాస్, సుకుమార్(Sukumar) రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. పాన్ ఇండియా(Pan India Movie) స్థాయిలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రామ్ చరణ్(Ramcharan) స్వయంగా తెలిపాడు.
బుచ్చిబాబు(Buchibabu) తీసే సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుందని రామ్ చరణ్(Ramcharan) ఇటీవలె చెప్పుకొచ్చాడు. దీంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఈ మూవీ ఇండియన్ రెజ్లర్ కోడి రామ్మూర్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు నెట్టింట వార్త వైరలయ్యింది. దీనిపై ఆర్సీ 16(RC 16) మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తమ సినిమా కథ అది కాదని ప్రకటించారు. దీంతో ఆర్సీ 16(ఇఢ 16) సినిమా కథపై వస్తున్న రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది.