ఎలాంటి పాత్రైనా చేయగల సత్తా ఉన్న హీరో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్. సినిమా సినిమాకు ప్రయోగం చేసే విక్రమ్.. మేకప్ కోసమే గంటల తరబడి సమాయాన్ని కేటాయిస్తుంటాడు. ప్రస్తుతం పా రంజిత్ డైరెక్షన్లో ‘తంగలాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విక్రమ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్లో.. కొన్ని రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్ లుక్ చూస్తే ఔరా అనాల్సిందే. ఇదిలా ఉంటే.. ఓ హిట్ సీక్వెల్లో విక్రమ్ విలన్‌గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దెబ్బకు అప్పులన్నీ కట్టేశానని చెప్పుకొచ్చాడు కమల్ హాసన్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌తో పాటు.. క్లైమాక్స్‌లో ‘రోలెక్స్’గా రచ్చ లేపాడు సూర్య. దాంతో ‘విక్రమ్-2’పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో విక్రమ్2 స్టార్ క్యాస్టింగ్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో సూర్యతో పాటు.. మరో పవర్ ఫుల్ విలన్‌గా చియాన్ విక్రమ్ కూడా కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ నిజంగానే విక్రమ్.. విక్రమ్ 2లో విలన్‌గా నటిస్తే మాత్రం.. ఊహకందని విధంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్.. దళపతి విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఖైదీ2 లేదా విక్రమ్ 2 ఉండే ఛాన్స్ ఉంది. అప్పుడే విక్రమ్2 విలన్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.