మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని దర్శకుడు బాబీ అద్భుతంగా తీర్చిదిద్దాడు. థియేటర్లలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీ డైరెక్టర్ బాబీ ఈ సినిమా చిత్రీకరణ గురించి కొన్ని విషయాలను తెలిపారు. వాల్తేరు వీరయ్య సినిమాను ఎడిటింగ్ రూమ్ లో రెండొందల సార్లకుపైగా చూశానని తెలిపారు.
ఏ సీన్ చూసినా అద్భుతంగా అనిపించిందన్నారు. ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ ను సముద్రంలో తీశారని, అనుకున్నవిధంగా షాట్ రావడం కోసం చిరు 10 రోజుల పాటు తడిశారని తెలిపారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా వచ్చిందన్నారు. చిరంజీవి అందరితో అభిమానంగా ఉంటారని, కష్టపడేవారిని ఆయన ఎంతగానో ఇష్టపడతారన్నారు.