Alluarjun: బన్నీ ప్రాజెక్ట్ అనౌన్స్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్!
గుంటూరు కారం విషయంలో అసలు ఏం జరుగుతోంది? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ సినిమా కంప్లీట్ అవుతుందా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే.. గుంటూరు కారం చుట్టూ పెద్ద తతంగమే నడుస్తోంది. ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తునే ఉంది. ఇలాంటి సమయంలో మాటల మాంత్రికుడు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో.. మహేష్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
ఈ మధ్య కాలంలో గుంటూరు సినిమాలో జరిగినన్ని మార్పులు చేర్పులు మరో సినిమాలో జరగలేదనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో రోజుకో కొత్త కొత్త పుకారు పుట్టుకొస్తునే ఉంది. అవి కేవలం రూమర్స్‌గానే ఉండిపోవడం లేదు.. వాటిని ఎప్పటికప్పుడు నిజం చేస్తునే ఉన్నారు మేకర్స్. చాలా కాలం డిలే తర్వాత ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు మహేష్, త్రివిక్రమ్. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. రీసెంట్‌గానే మహేష్ సమ్మర్ వెకేషన్ నుంచి తిరిగి రావడంతో.. తిరిగి షూటింగ్ మొదలు పెట్టారు.
కానీ ఈ మధ్యలో హీరోయిన్ పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయిపోయింది.. కొత్తగా మీనాక్షి చౌదరి జాయిన్ అయింది. దీంతో రీషూట్ చేస్తున్నారు. అయినా కూడా అనుకున్న సమయానికి గుంటూరు కారం షూటింగ్ జరుపుకోవడం లేదని టాక్. సినిమా రిలీజ్‌కు మరో ఆరు నెలలు మాత్రమే ఉంది. ఇంతవరకు సగం షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఈ లెక్కన.. సంక్రాంతికి కూడా గుంటూరు కారం కష్టమే అంటున్నారు. ఇక ఇప్పుడు సడన్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు త్రివిక్రమ్.
ఈసారి చేసేది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేశాడు. అసలు గుంటూరు కారం షూటింగ్‌నే త్రివిక్రమ్ సక్కగా చేయడం లేదు.. కానీ ఇంతలోనే బన్నీతో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇప్పుడీ అనౌన్స్మెంట్ అవసరమా? అంటూ మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు.. గుంటూరు కారం తెర వెనక ఏదో జరుగుతుందనే డౌట్స్ వస్తున్నాయి. ఏదేమైనా.. ఇదంతా చూస్తుంటే.. మహేష్ బాబు, త్రివిక్రమ్ మధ్య ఎక్కడో తేడా కొట్టిసినట్టే ఉంది వ్యవహారం.