Vimanam Movie: ‘విమానం’ మూవీ నుంచి అనసూయ పోస్టర్ రిలీజ్
విభిన్న పాత్రలు పోషించే సముద్రఖని(Samudrakhani) నటిస్తోన్న ద్విభాషా చిత్రం విమానం(Vimanam Movie). ఈ మూవీకి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.
విభిన్న పాత్రలు పోషించే సముద్రఖని(Samudrakhani) నటిస్తోన్న ద్విభాషా చిత్రం విమానం(Vimanam Movie). ఈ మూవీకి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. జూన్ 9వ తేదిన ఈ మూవీ రిలీజ్(Release) కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, ఓ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యి మూవీపై ఆసక్తిని పెంచాయి. ఈ మూవీలో సముద్రఖని(Samudrakhani) పాత్ర వీరయ్య గెటప్ ను ప్రేక్షకులకు చిత్ర యూనిట్ ఇప్పటికే పరిచయం చేసింది.
విమానం సినిమా(Vimanam Movie)లో వీరయ్య అంగవైకల్యంతో ఉంటాడు. కొడుకుగా మాస్టర్ ధ్రువన్ నటిస్తున్నాడు. వీరే కాకుండా ఈ మూవీలో సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj), రాజేంద్ర ప్రసాద్, ధన్ రాజ్, రామకృష్ణ వంటివారు నటిస్తున్నారు. తాజాగా వీరి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విమానం సినిమా(Vimanam Movie) ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం సినిమా నుంచి సిన్నోడా ఓ సిన్నోడా అనే సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతే కాకుండా ఆడియెన్స్‌ను వారి తొలి విమాన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను #MyFirstVimanam కు ట్యాగ్ చేస్తూ @VimanamTheFilm అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆహ్వానించిన టీమ్, వారికి బహుమతులను కూడా అందించనుంది.