»Ssmb 29 The Title Of Ssmb 29 Which Has Gone Viral What
SSMB 29: వైరల్‌గా మారిన SSMB 29 టైటిల్.. ఏమన్నా పెట్టారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కోసం దశాబ్ద కాలంగా వెయిట్ చేస్తునే ఉన్నారు ఘట్టమనేని అభిమానులు. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కానేలేదు కానీ.. టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ అప్పుడే ఓ టైటిల్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు ఇది రాజమౌళి టీమ్ నుంచి లీక్ అయిందా? లేదా ఆర్ఆర్ఆర్ ఎఫెక్టా అనేది తెలియదు గానీ.. ఈ టైటిల్ మాత్రం వైరల్‌గా మారింది. ప్రస్తుతానికి మహేష్, రాజమౌళి సినిమాకు ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌ను వాడుతున్నారు అందరూ. మహేష్ బాబు 29వ సినిమా కాబట్టి ఎస్ఎస్ఎంబీ 29 అంటున్నారు.
ఒకవేళ రాజమౌళి పేరు కూడా యాడ్ అయితే.. ఎస్ఎస్ఆర్ఎంబీ వర్కింట్ టైటిల్ అయ్యేలా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లను కలుపుతూ ‘మహారాజ్’ అనే టైటిల్‌ను ప్రచారం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు.. రామ్ చరణ్, రామారావు, రాజమౌళి పేర్లు కలిసేలా ఆర్ఆర్ఆర్ అంటూ ప్రకటించాడు రాజమౌళి. కానీ ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్‌కు సాలిడ్ రెస్పాన్స్ రావడంతో.. దాన్నే సినిమా టైటిల్‌గా పెట్టేశాడు జక్కన్న.
ఇక ఇప్పుడు మహేష్, రాజమౌళి పేర్లలోని మొదటి మూడు లక్షల కలయికలో MAH RAJ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో నిజముందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. ఆర్ఆర్ఆర్ తరహాలోనే ఈ టైటిల్ తెరపైకి వచ్చి ఉంటుందని అంటున్నారు. ఇకపోతే.. త్వరలోనే జక్కన్న ఈ ప్రాజెక్ట్ వివరాలను తెలియజేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్టు లాక్ చేసేశారు.. ప్రజెంట్ మహేష్ బాబు ఫిజికల్‌గా రెడీ అవుతున్నాడు. మరోవైపు రాజమౌళి స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఏదేమైనా.. మహారాజ్ అనే టైటిల్ మాత్రం వైరల్‌గా మారింది.