Tata motors EV’s price cut : ప్రముఖ వాహన ఉత్పత్తుల సంస్థ టాటా మోటార్స్ తమ ఎలక్ట్రిక్ కార్ల రేట్లను భారీగా తగ్గించింది. ఎవరైతే ఈవీలను కొనాలనే ఆలోచనలో ఉన్నారో వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. గరిష్ఠంగా రూ. 1.2 లక్షల వరకు ధరల్ని తగ్గించినట్లు సంస్థ ప్రకటించింది. ఏఏ మోడళ్లపై ఎంతెంత ధరల్ని తగ్గించింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
చదవండి : గూగుల్ పే పేమెంట్ తరచుగా ఫెయిలవుతోందా.. ఇవిగో టిప్స్
టాటా ఈవీల సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్లుగా టాటా నెక్సాన్ ఈవీ(Tata Nexon EV), టాటా టియాగో ఈవీలు ఉన్నాయి.
బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్ టాటా నెక్సాన్ ఈవీపై సంస్థ ఏకంగా రూ. 1.2లక్షల వరకు ధరలను తగ్గించింది. దీంతో ఇప్పుడు టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 14.49లక్షలకు పడిపోయింది. అలాగే ఎంట్రీ లెవల్ టాటా టియాగో ఈవీ(Tata Tiago EV)పై రూ. 70వేలు తగ్గించింది టాటా మోటార్స్. ఈ ప్రైజ్ కట్‌తో ఇప్పుడు దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 7.99లక్షలకు చేరింది.
ఎలక్ట్రిక్ కార్ ధర నిర్ణయం కావడంలో బ్యాటరీ ధర కీలకంగా ఉంటుంది. ఇటీవల బ్యాటరీల ధరలు దిగి వస్తుండటంతో వీటి ధరల్ని తగ్గించేందుకు సంస్థ ముందుకు వచ్చింది. వినియోగదారులకు మరింత లబ్ధిని చేకూర్చాలనే ఉద్దేశంతోనే తాము కార్ల రేట్లను తగ్గించినట్లు టాటా మోటార్స్ సీసీఓ వివేక్ శ్రీవత్స వెల్లడించారు.