థియేటర్‌కు వెళ్లి సినిమా చూడలేని వారంతా.. ఇప్పుడు ఓటిటి లవర్స్‌గా మారిపోయారు. కొత్త సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే.. ఓటిటి డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ వారంలో వచ్చిన సినిమాలు ఓటిటి లవర్స్ పండగ చేసుకునేలా ఉన్నాయి.
Sankranthi Movies: ఈ వారం థియేటర్లోకి.. తెలుగు నుంచి యాత్ర 2, ఈగల్ సినిమాలు రిలీజ్ అవగా.. సూపర్ స్టార్ రజనీ కాంత్ గెస్ట్ రోల్ చేసిన లాల్ సలామ్ డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ అయింది. అయితే.. థియేటర్లో కొత్త సినిమాల సందడి ఉంటే.. ఓటిటిలో సంక్రాంతి సినిమాల హవా నడుస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా నెల రోజుల్లోపే ఓటిటిలోకి వచ్చేసింది. టాక్‌తో సంబంధం లేకుండా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన గుంటూరు కారం.. ఫిబ్రవరి 9 నుంచి ఓటిటిలోకి వచ్చేసింది.
ఇది కూడా చూడండి: Lavanya Tripati: ఈమె నుంచి ఈ ఫిట్నెస్ సీక్రెట్స్ మనం నేర్చుకోవాల్సిందే..!
ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే రోజు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్న కెప్టెన్ మిల్లర్.. రెండు వారాల తర్వాత తెలుగులో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అయిందా? లేదా? అన్నట్టుగానే థియేటర్ నుంచి వెళ్లిపోయింది. లేటెస్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చేసింది కెప్టెన్ మిల్లర్. తమిళ్, తెలుగు సహా ఇతర భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది.
ఈ సినిమాకు పోటీగా రిలీజ్ అయిన శివ కార్తికేయన్ ‘అయలాన్’ సినిమా మాత్రం కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే ఓటిటిలోకి వచ్చింది. సన్ నెక్స్ట్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ ఎప్పుడు ఓటిటిలోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలతో పాటు స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల డెబ్యూ మూవీ ‘బబుల్ గమ్’ కూడా ఆహాలోకి వచ్చేసింది. మొత్తంగా ఈ వారం ఓటిటి లవర్స్‌కు పండగేనని చెప్పొచ్చు.