కంటెంట్ విధానాలను పదేపదే ఉల్లంఘించినందుకు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీపై టెక్ దిగ్గజం మెటా కఠిన చర్యలు తీసుకుంది. అతని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది.
Iran: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీపై టెక్ దిగ్గజం మెటా కఠిన చర్యలు తీసుకుంది. అతని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. కంటెంట్ విధానాలను పదేపదే ఉల్లంఘించినందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది. ఖమేనీ అకౌంట్లతోపాటు ఇరాన్ నెట్‌వర్క్‌తో అనుసంధానంగా ఉన్న సుమారు 200 ఫేస్బుక్, 125 ఇన్‌స్టా ఖాతాలను కూడా మెటా తొలగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు ఉగ్రదాడి జరిపిన దగ్గరి నుంచి సుప్రీం లీడర్‌పై నిషేధం విధించాలంటూ మెటాపై ఒత్తిడి తీసుకొచ్చింది. హమాస్ జరిపిన విధ్యంసానికి ఖమేనీ మద్దతు ఇవ్వడమే కాకుండా గాజాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మిలిటెంట్ల చర్యలను, ఎర్ర సముద్రంలో నౌకలపై హుతీల దాడులను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో 30 ఏళ్లకు పైగా ఖమేనీ అధికారంలో ఉంటున్నారు. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక్కడ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌పై ఆంక్షలు ఉన్నాయి. అక్కడి ప్రజలు వర్చువల్ ప్రైవేటు నెట్వర్క్ ద్వారా ఈ మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు.