ఇవాళ ‘వరల్డ్ బ్యాకప్ డే’. డేటా భద్రత ప్రాముఖ్యతను ఈరోజు గుర్తుచేస్తోంది. మన ఫొటోలు, ఫైల్స్ పోకుండా ఉండాలంటే ‘3-2-1’ సూత్రం తప్పనిసరి. అంటే.. ఒరిజినల్‌తో కలిపి మొత్తం 3 కాపీలు ఉండాలి. వీటిని కనీసం 2 వేర్వేరు రకాల స్టోరేజీల్లో(హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్) సేవ్ చేయాలి. అందులో 1 కాపీని కచ్చితంగా క్లౌడ్‌లో భద్రపరచాలి. మీ డిజిటల్ జ్ఞాపకాలు ఎప్పటికీ సురక్షితంగా ఉంటాయి.