టీమ్ఇండియా పేసర్ దీపక్ చాహర్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా రెండు, మూడు ఐపీఎల్ సీజన్లు ఆడగలరన్నారు. గత ఐపీఎల్ సీజన్లో ధోనీ మోకాలి గాయం కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు.
Deepak Chahar: టీమ్ఇండియా పేసర్ దీపక్ చాహర్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా రెండు, మూడు ఐపీఎల్ సీజన్లు ఆడగలరన్నారు. గత ఐపీఎల్ సీజన్లో ధోనీ మోకాలి గాయం కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం శస్త్ర చికిత్స చేయించుకుని పూర్తిగా కోలుకున్నాడని దీపక్ చాహర్ అన్నారు. ధోనీ క్రికెట్కు ఇవ్వాల్సింది చాలా ఉంది. ఇంకా 2-3 ఐపీఎల్ సీజన్లు ఆడగలిగే సత్తా అతనిలో ఉందన్నాడు. ధోనీ అలా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. చివరి నిర్ణయం ధోనీదే. తన చివరి మ్యాచ్ చెన్నైలోనే అని అందరికీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఊహించడం కష్టమే. సీఎస్కే అంటేనే మహీ భాయ్ అని అన్నారు.
ధోనీకి క్లోజ్ కావడానికి నాకు రెండు నుంచి మూడేళ్లు పట్టింది. అతడిని నా పెద్ద అన్నయ్యలా చూస్తాను. ధోనీ నన్ను తమ్ముడిగా భావిస్తాడు. మా ఇద్దరి మధ్య సరదా క్షణాలు చాలా ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ఇద్దరం కలిసి పబ్జీ ఆడేవాళ్లం. మైదానం వెలుపల అతడితో చాలా సమయం గడిపాను. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను. అది నా అదృష్టం. టీమ్ఇండియాకు ఆడగలిగానంటే అది కేవలం ధోనీ భాయ్ వల్లే సాధ్యమైంది. అంతకుముందు 2018 ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్లు ఆడే అవకాశం ఇచ్చాడని దీపక్ చాహర్ తెలిపాడు.