గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో నౌకలపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం బ్రిటన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకులతో వెళ్తున్న ఓ నౌకపై క్షిపణితో దాడి చేశారు.
Red Sea: గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో నౌకలపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం బ్రిటన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకులతో వెళ్తున్న ఓ నౌకపై క్షిపణితో దాడి చేశారు. దీంతో కార్గో ట్యాంకులో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపుచేశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ ఘటన సౌత్ ఈస్ట్ ఎడెన్‌కు 60 నాటికల్ మైళ్ల దూరంలో జరిగింది. ఇంకా దాడులు జరిగే ప్రమాదం ఉందని.. ఈమార్గంలో వెళ్లే నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు హుతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఒక క్షిపణిని తమ యుద్ధ నౌకలు కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది. మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో గస్తీ తిరుగుతున్న అమెరికా యుద్ధనౌక ఈఎస్ఎస్ కార్నే పై హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం క్షిపణిని ప్రయోగించారు. దీన్ని తమ దళాలు కూల్చివేశాయని అమెరికా మిలిటరీ తెలిపింది. అయితే ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై హౌతీ దాడులకు దిగినప్పటి నుంచి, అమెరికా నౌకను డైరెక్ట్‌గా టార్గెట్ చేయడం ఇదే తొలిసారి.
గాజాపై ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఎర్ర సముద్రంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్ సహా పశ్చిమదేశాలకు చెందిన నౌకలపై హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో దాడులకు పాల్పడుతున్నారు. ఆ మార్గంలో విదేశీ వాణిజ్య నౌకలు ప్రయాణించడానికి భయపడుతున్నాయి. చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల ప్రయాణ ఖర్చు భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, యెమెన్‌లోని హౌతీ రెబెల్స్ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ జాబితాలోకి పరోక్షంగా చైనా చేరింది. యెమెన్‌లోని హౌతీలతో పాటు పలు మిలింటెంట్ గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్న ఇరాన్‌ను చైనా హెచ్చరించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నౌకలపై దాడులు ఆపకపోతే ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు తెంచుకునేందుకు డ్రాగన్ సిద్ధపడినట్టు తెలుస్తోంది.