»Sai Pallavis Dance At Her Sisters Engagement Goes Viral On The Internet
Sai Pallavi: చెల్లి ఎంగేజ్మెంట్ లో డ్యాన్స్ ఇరగదీసిన సాయిపల్లవి..!
దక్షిణాది స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. సాయిపల్లవి ఏ మూవీలో నటిస్తే.. ఆ మూవీ పక్కా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. కాగా.. ఆమె వరస సినిమాలతో బిజీగా ఉండగా.. రీసెంట్ గా ఆమె చెల్లెలు మాత్రం పెళ్లికి రెరడీ అయ్యింది. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే.. ఆ ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి చేసిన డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే, సాయిపల్లవి ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పూజా కన్నన్ తన ప్రియుడు వినీత్ని పెళ్లి చేసుకోనుంది. పూజా, వినీత్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇటీవల పూజా తన ఇన్స్టాగ్రామ్లో నిశ్చితార్థ వేడుక నుండి ఫోటోలను పంచుకున్నారు. మెహందీ వేసుకుని నవ్వుతూ కనిపించింది. తన అక్క సాయి పల్లవితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను కూడా షేర్ చేసింది.
అయితే.. తన సోదరి ఎంగేజ్మెంట్ వేడుకలో సాయి పల్లవి డ్యాన్స్ ఇరగదీసింది. మూమూలుగానే సాయిపల్లవి డ్యాన్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ డ్యాన్స్ వీడియోని చూసి ఫ్యాన్స్ మరింత సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ కూడా సినిమాల్లో నటించింది. తమిళంలో ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ‘చిత్తిరై సెవ్వానం’లో నటించింది. ఇందులో సముద్రఖని, రీమా కల్లింగల్ , ఇతరులు నటించారు. ఇక సాయి పల్లవి నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.