Nayanathara: నయనతార క్షమాపణలు చెప్పింది. తనను క్షమించమని కోరుతూ పోస్ట్ రిలీజ్ చేసింది. ‘అన్నపూర్ణి’ సినిమా వివాదంపై నటి నయనతార స్పందించింది. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేధికగా రియాక్ట్ అయింది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన నయనతార(Nayanathara)పై కేసు కూడా నమోదు అయింది. ఈ నేపథ్యంలో నటి క్షమాపణ లేఖను విడుదల చేసింది. తన ఇన్స్టాగ్రామ్లో లేఖను పోస్ట్ చేసింది. తనకు గాని తన చిత్రబృందానికి గానీ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు నయనతార. ‘ఓం’ గుర్తు, ‘జై శ్రీరామ్’ నినాదంలో కూడిన క్షమాపణ లేఖను హీరోయిన్ నయనతార షేర్ చేసారు.
మంచి మెసేజ్ అందించేందుకు తాము చేసిన ప్రయత్నం అనుకోని రీతిలో ఇతరులకు బాధ కలిగించి ఉండవచ్చునని ఆమె అన్నారు. సెన్సార్ బోర్డ్ అనుమతి తీసుకొని గతంలో థియేటర్లలో ప్రదర్శించిన సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లో నుంచి తీసేస్తారని తాము అసలు ఊహించలేదని తెలిపారు. దీని ప్రభావం ఏమిటనేది అర్థం చేసుకున్నామన్నారు. అన్నపూర్ణి చిత్రం ద్వారా ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పారు. దైవాన్ని మనస్పూర్తిగా నమ్మె వ్యక్తిని తానని, దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను కూడా తరచుగా సందర్శిస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు.
ఈ మూవీలో నయనతార క్యారెక్టర్ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి (నయనతార క్టారెక్టర్ పేరు అన్నపూర్ణి). ఇండియాలోనే టాప్ చెఫ్ కావాలనేది ఆమె కోరిక. దాని గురించే రోజు కలలు కంటు ఉంటుంది. అయితే..తన లక్ష్యం, సనాతన ఆదర్శాల మధ్య ఆమె కొన్ని అడ్డుంకులను ఎదుర్కుంటుంది. అన్నింటిని నడుమ ఎలా చెఫ్ అయ్యిందన్న కథ సారంశంతో అన్నపూర్ణి చిత్రాన్ని తీసారు. అయితే ఈ సినిమాలో నయనతార క్లాస్మెట్ ఫర్హాన్, ఆమె చెఫ్ అవడానికి సపోర్ట్ చేస్తాడు. ఈ క్రమంలో అన్నపూర్ణి మాంసాహారం తినడం మొదలుపెడుతుంది. ఒక సీన్ లో ఫర్హాన్, నయనతారని మాంసం తినేలా ప్రోత్సహిస్తాడు. రామూడు కూడా మాంసాహారం తినేవాడని, మాంసాహారం తినడం పాపమేం కాదని సీన్ లో ఉంటుంది.
ఇలాంటి కొన్ని సీనిలపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. డిసెంబర్ ఒకటో తేదీన అన్నపురాణి చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 29వ తేదీన దీన్ని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు అయింది. నటులు నయనతార, జై, రచయిత-దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథి, ఆర్ రవీంద్రన్, పునీత్ గోయెంకాతో పాటు జీ స్టూడియోస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షరీక్ పటేల్, నెట్ఫ్లిక్స్ ఇండియా అధినేత మోనికా షెర్గిల్ పేర్లను తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా గత వారమే ‘అన్నపూర్ణి’ సినిమాని నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి తొలగించింది.