బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. డాక్టర్లు ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీ చికిత్సలో భాగంగా ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 48 గంటల పాటు ఎక్మో చికిత్స అందించనున్నారు. కుప్పం హాస్పిటల్ నుండి నిన్న అర్ధరాత్రి తారకరత్నను బెంగళూరుకు తరలించారు.
ఇక్కడ ఎక్మో చికిత్సను అందించే మూడు హాస్పిటల్లలో నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఒకటి. చంద్రబాబు నాయుడుతో పాటు కుటుంబ సభ్యులు కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడారు. అనంతరం నారాయణ హృదయాలయకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దీంతో కుప్పం నుండి రాత్రి బెంగళూరుకు తరలించారు. బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు బెంగళూరులో ఉన్నారు. సాయంత్రం చంద్రబాబు వెళుతున్నారు.
లోకేష్ యువగళంలో పాల్గొన్న తారకరత్న ఉదయం గం.11.20 సమయంలో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. దీంతో కుప్పంలో హాస్పిటల్ కు తరలించారు. ఇప్పుడు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.