పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య, భారత టెన్నిస్ తార సానియా మీర్జాపై ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా చేసిన ప్రయత్నానికి గర్విస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్… సానియాకు భావోద్వేగ సందేశంతో ట్వీట్ చేశాడు.
బ్రెజిల్‌కు చెందిన లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్‌తో జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సానియా, రోహన్ బోపన్నలు ఓడిపోయారు. సానియా తన 7వ గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకోలేకపోయింది. 2009లో సానియా తొలి గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు మెల్బోర్న్ మ్యాచ్‌తో సానియా టెన్నిస్ పరుగు ముగిసింది. మహిళా క్రీడాకారులందరికీ మీరు ఆశాకిరణం.. మీ కెరీర్లో మీరు సాధించిన ప్రతిదానికీ చాలా గర్వంగా ఉంది… మీరు చాలామందికి స్ఫూర్తిగా ఉన్నారు, బలంగా కొనసాగండి. నమ్మశక్యం కాని కెరీర్‌కు అభినందనలు అంటూ షోయబ్ ట్వీట్ లో పేర్కొన్నాడు.