నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం అన్నపూర్ణి. ఈ చిత్రం ప్రస్తుతం వివాదంలో ఉంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఈ సినిమాని ఓటీటీ నుంచి తొలగించారు.
Nayanthara: నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం అన్నపూర్ణి. చిన్నతనం నుంచి చెఫ్ అవ్వాలి అనేది ఆమె కోరిక. దాని కోసం బ్రహ్మణ కుటుంబంలో ఫుట్టిన నాన్ వెజ్ తినడం కూడా అలవాటు చేసుకుంది. ఈ మూవీ చాలా మందికి విపరీతంగా నచ్చింది. కానీ.. కొందరు మాత్రం మూవీని వ్యతిరేకించారు. రాముడిని కించపరిచారని, లవ్ జిహాద్ కి సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జీ స్టూడియో రాసిన లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘అన్నపూరణి’లో హిందూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పారు.
సినిమాలోని సమస్యాత్మక భాగాలను పరిష్కరించాలని, నెట్‌ఫ్లిక్స్ చలనచిత్రాన్ని సవరించని వరకు దాని OTT ప్లాట్‌ఫారమ్ నుండి తీసివేయాలని చిత్ర సహ నిర్మాతలైన M/s ట్రైడెంట్ ఆర్ట్స్‌ను జీ కోరారు. హిందూ, బ్రాహ్మణ వర్గాల మత విశ్వాసాలను కించపరిచినందుకు జీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. జీ స్టూడియోస్ అన్నపూర్ణికి క్షమాపణ లేఖ విడుదల చేసింది. జనవరి 11న అనగా ఈరోజు నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫారమ్ నుండి సినిమాను తీసివేసింది. హిందూ వ్యతిరేక కంటెంట్‌తో సోషల్ మీడియాలో ఈ చిత్రంపై చాలా విమర్శలు వచ్చాయి.
ఈ చిత్రం ఇస్లాం మతంలోకి మారడాన్ని ప్రోత్సహించిందని హిందువుల ఆరాధ్య దైవమైన భగవాన్ రామ్‌ను వక్రీకరించిందని, హిందూ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇప్పుడు ఈ వివాదం తర్వాత తీసివేశారు. 2023 డిసెంబర్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయిన అన్నపూర్ణి తమిళ నటి నయనతార నటించిన 75వ చిత్రం. ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. జై ప్రధాన పాత్రలో నటించారు.