సికింద్రాబాద్ లోని మారేడుపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మారేడుపల్లిలో ఉన్న శ్రీలా హిల్స్ అనే అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చుట్టుపక్కన ఉండే ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రమాదం ఎలా జరిగింది.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.