toxic foam seen on indrayani river in pune district
సాధారణంగా నగరాల్లో ఉండే చెరువులు కానీ.. ఇతర కుంటలు, నదులు గట్రా డ్రైనేజ్ నీళ్లు, ఇతర వ్యర్థాలతో నిండిపోతాయి. చివరకు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా అందులోనే కలుస్తుంటాయి. అందుకే.. నగరాల నుంచి ప్రవహిస్తూ వెళ్లే ఏ నీటిని కూడా జనాలు తాగరు. ఖచ్చితంగా అవి నగరాల్లో కలుషితం అవుతాయి. అలా చాలా నగరాల్లో ప్రవహించే నదులు, చెరువులు కలుషితం అయ్యాయి.
అయితే.. మహారాష్ట్రలోని పూణె జిల్లా నుంచి ప్రవహిస్తూ వెళ్లే ఇంద్రాయని నది పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. ఆ నదిలో విషపు వ్యర్థాలు కలవడంతో ఆ నదిలో ఎక్కడ చూసిన విషపు నురగలు తయారవుతున్నాయి. వాటిని చూసి పూణె వాసులు బెంబేలెత్తుతున్నారు. ఈ నది వల్ల జనాలకు ఎటువంటి రోగాలు వస్తాయో అని టెన్షన్ పడుతున్నారు. పూణె జిల్లాలోని అలంది టౌన్ దగ్గర్లో అయితే ఈ నదిలో ఎక్కడ చూసినా తెల్లని నురగ కనిపిస్తోంది. అది పలు ఫ్యాక్టరీల నుంచి వచ్చిన విషపు వ్యర్థాల వల్ల తయారయిందే అని అంటున్నారు.
కెమికల్ వేస్ట్ లను నదిలో కలపడం వల్ల నది కలుషితం అవడమే కాకుండా.. దాని చుట్టుపక్కన ప్రాంతాల్లో నివసిస్తున్న జంతువులు, మనుషులకు చాలా సమస్యలు తీసుకొస్తుందని ప్రజలు వాపోతున్నారు. గత 10 ఏళ్లుగా ఈ సమస్య ఉందని.. గత నాలుగేళ్ల నుంచి ఈ నదిని మరింత కలుషితం చేస్తున్నారని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరి నుంచి స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ నది పక్కనే సిద్ధేశ్వర్ ఘాట్ ఉంది. అక్కడ వృద్ధేశ్వర్ సిద్ధేశ్వర్ గుడి ఉంది. అక్కడికి రోజూ ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి సిద్ధేశ్వరుడిని దర్శించుకుంటూ ఉంటారు. కానీ.. పక్కనే ఉన్న ఈ నది పరిస్థితిని చూసి అక్కడికి రావాలంటేనే జంకుతున్నారు.
#WATCH | Maharashtra: A layer of toxic foam seen on Indrayani river in Alandi town of Pune district.
Local residents & devotees near Siddheshwar Ghat say that the issue has been going on for past 10 yrs & has aggravated in the last 4 yrs, also say that no action has been taken pic.twitter.com/pK4TuFOk6X