Ather 450 Apex: ప్రముఖ వాహన సంస్థ ఏథర్ నుంచి కొత్త స్కూటర్ లాంచ్ అయ్యింది. ఏథర్ 450 అపెక్స్ స్కూటర్‌ను కంపెనీ ఈరోజు విడుదల చేసింది. దీని ధర రూ.1.89 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఏథర్ ప్రస్తుతం 450 ఎస్, 450 ఎక్స్ పేరుతో అల్రెడీ రెండు మోడల్స్ ఉన్నాయి. మరి కొత్తగా వచ్చిన ఈ స్కూటర్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. ఏథర్ 450 అపెక్స్ స్కూటర్లో 3.7kWh బ్యాటరీ పవర్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 157 కిలోమీటర్లు ప్రయాణిస్తుందట. ఇందులో మొత్తం అయిదు రైడింగ్ మోడ్లు ఇచ్చారు. వ్రాప్ మోడ్ స్థానంలో కొత్తగా వ్రాప్ ప్లస్‌ను పరిచయం చేశారు.
అలాగే మ్యూజిక్ ట్విస్ట్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చారు. సాధారణంగా బ్రేక్ వేసేటప్పుడు థ్రోటల్ రిలీజ్ చేస్తూ.. బ్రేక్ అప్లే చేస్తుంటాం. అయితే ఈ కొత్త ఫీచర్లో థ్రోటల్ రిలీజ్ చేసిన ప్రతిసారి బ్రేక్ వేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా బ్రేక్ అప్లే అవుతుంది. ఈ స్కూటర్ 2.09 సెకన్లలోనే 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఏథర్ 450 అపెక్స్ను ఇడియమ్ బ్లూ రంగులో తీసుకొచ్చారు. ఇది అయిదేళ్లు 60వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో వస్తోంది. 450 ఎక్స్‌తో పోలిస్తే హార్డ్‌వేర్ పరంగా ఇతర మార్పులేవీ చేయలేదు. ఈ స్కూటర్ బుకింగ్స్ గత నెల నుంచే ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్ కావాలనుకునే వాళ్లు రూ.2500 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.