»Traffic Challan Rs 67 Crores Collected With Pending Challans
Traffic Challan: పెండింగ్ చలాన్లతో రూ.67 కోట్లు వసూలు
తెలంగాణ ప్రభుత్వం ఈ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన లభిస్తోందని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చలాన్ల ద్వారా కోట్ల అమౌంట్ వచ్చిందని తెలిపారు.
Traffic Challan: తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లకు రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన లభిస్తోందని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.3.59 కోట్ల చలాన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వీటిలో 77 లక్షల చలాన్లు చెల్లింపు అయ్యాయని తెలిపారు. వీటి ద్వారా రూ.67 కోట్ల పెండింగ్ చలాన్ల అమౌంట్ కలెక్ట్ అయ్యిందని తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు చలాన్లు చెల్లించవచ్చని గుర్తు చేశారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని సూచించారు.