పుష్ప2 తర్వాత బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి.. డైరెక్టర్ ఎవరు.. ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. అనే విషయాల్లో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే పుష్ప2 రిలీజ్ తర్వాత బన్నీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి తెలిసే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు బన్నీ నెక్ట్స్ డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.. అది కూడా హిట్ కాంబో కావడంతో నిజమే అంటున్నారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోకస్ మొత్తం పుష్ప2 పైనే ఉంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నబన్నీ.. పుష్ప2తో మరోసారి దుమ్ములేపాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు బన్నీ. ఇప్పటికే వేణు శ్రీరామ్‌తో పాటు ఇంకొందరు డైరెక్టర్స్ బన్నీ కోసం వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరోసారి పని చేయబోతున్నట్టు తెలుస్తోంది.
గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో.. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలొచ్చాయి. ఈ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు త్రివిక్రమ్-బన్నీ. అందుకే పుష్ప2 తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఈ క్రేజీ కాంబో రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్‌కు కమిట్ అవలేదు మాటల మాంత్రికుడు. బన్నీ కూడా సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నాడు. పైగా పుష్ప2, ఎస్ఎస్ఎంబీ28 ప్రాజెక్ట్స్ ఇంచు మించు ఒకేసారి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ఉన్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్ మరోసారి కలిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదే నిజమైతే త్రివిక్రమ్‌కు ఇదే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అని చెప్పొచ్చు. మరి నిజంగానే నాలుగోసారి వీళ్లు కలిసి పనిచేస్తారేమో చూడాలి.