Earthquake : మధ్యప్రదేశ్ లో మరోసారి భూమి కంపించింది. డిసెంబర్ 31 ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. ఎంపీ సింగ్రౌలిలో వారం వ్యవధిలో రెండోసారి భూకంపం సంభవించింది. భూకంపం రావడంతో భయాందోళనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం భూకంపం 3.6 తీవ్రతతో నమోదైంది.
ఆదివారం మధ్యాహ్నం 2:33 గంటలకు భూకంపం సంభవించింది. ఎంపీ సింగ్రౌలీలో భూకంపం సంభవించింది. నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న ప్రజలు భూకంపం రావడంతో భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం ఊరటనిచ్చే అంశం. భూకంపం తర్వాత, పరిపాలన కూడా అప్రమత్తమైంది. భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. డిసెంబర్ 26న మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీలో కూడా భూకంపం సంభవించింది. రియాక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి నష్టం జరగలేదు.